Sravan Rao Arrest: 6కోట్ల రూపాయల మోసం.. చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్..

బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Sravan Rao Arrest: సీసీఎస్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. చీటింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావు పై సీసీఎస్ లో కేసు నమోదైంది. అఖండ ఎంటర్ ప్రైజస్ కి 6 కోట్ల రూపాయల మోసం చేశారన్న కేసులో శ్రవణ్ రావు ని అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. చీటింగ్‌ కేసులో ఆయనపై అభియోగాలు వచ్చాయి. విచారణకు రావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: కేటీఆర్‌కు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మారతారంటూ ప్రచారం.. మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

అఖండ ఎంటర్ ప్రైజస్ సంస్థను రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రవణ్‌ రావుపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు.