Harish Rao: కేటీఆర్‌కు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మారతారంటూ ప్రచారం.. మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనని తేల్చి చెప్పారు.

Harish Rao: కేటీఆర్‌కు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ మారతారంటూ ప్రచారం.. మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

Updated On : May 13, 2025 / 8:18 PM IST

Harish Rao: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు హరీశ్ రావు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఇదివరకే ఖండించినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారాయన.

 

కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను అని కొన్ని వందల సార్లు చెప్పాను అని హరీశ్ రావు అన్నారు. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనని తేల్చి చెప్పారు. మై లీడర్ ఇజ్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీశ్ రావు విల్ ఫాలో అని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణలో ఈ పథకం కింద 10 వేల ఇళ్లు.. ఒక్కో ఇంటికి రూ.లక్షా 20 వేలు

”కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సహకరిస్తా. కేసీఆర్ మాట జవదాటను, కేసీఆర్ గీసిన గీతను దాటను. కొత్త పార్టీ పెడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తను. బీఆర్ఎస్ లో ఎలాంటి విబేధాలు లేవు” అని హరీశ్ రావు అన్నారు.