constable suicide : పెళ్లైన వంద రోజులకే పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపధ్యంలో మనోవేదనకు గురైన ఓ కానిస్టేబుల్ పెళ్లైన వందరోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు.

Cop Suicide In Telangana
police constable suicide, due to family disputes : కుటుంబ కలహాల నేపధ్యంలో మనోవేదనకు గురైన ఓ కానిస్టేబుల్ పెళ్లైన వందరోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గోండ జిల్లా డిండి మండలం ఖానాపూర్ కు చెందిన మల్లికార్జున సైదులు(30) మర్రిగూడ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
నాలుగు నెలల క్రితం డిసెంబర్ 18న అతనికి అదే జిల్లాలోని కొండమల్లెపల్లికి చెందిన యువతితో వివాహం అయ్యింది. అనంతరం కొత్త దంపతులు మర్రిగూడలో కాపురం పెట్టారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో తీవ్రమనస్తాపంచెందిన సైదులు సోమవారం సాయంత్రం డ్యూటీకి వెళుతున్నానని చెప్పి యూనిఫాం వేసుకుని బైక్ పై బయటకు వచ్చాడు. వచ్చేప్పుడు భార్య చున్నీని తనతో తెచ్చుకున్నాడు. మర్రిగూడ పోలీసు స్టేషన్ కు విధులకు వెళ్ళకుండా యాచారం వచ్చాడు.
అక్కడ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవటం… పెళ్లైన మూడు నెలలకే భర్త దూరం కావటంతో మృతుడి తల్లి తండ్రులు , భార్య రోదించిన తీరు అక్కడి వారి హృదయాలను కదిలించి వేసింది.