RJ Simran Singh : పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్‌జే సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..

RJ Simran Singh : ఫ్రీలాన్స్ రేడియో జాకీ (RJ), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ గురుగ్రామ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

Popular instagram influencer

RJ Simran Singh : జమ్మూకి చెందిన ప్రముఖ ఫ్రీలాన్స్ రేడియో జాకీ (RJ), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ గురుగ్రామ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సెక్టార్ 47లోని తన అపార్ట్‌మెంట్‌లో 25 ఏళ్ల సిమ్రాన్ విగతజీవిలా కనిపించింది.

సిమ్రాన్‌తో నివసిస్తున్న స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాడు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో సిమ్రాన్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.

అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుంది. వివరాల్లోకి వెళితే.. సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య కాదని ఆమె కుటుంబం భావిస్తోంది. ఆమె మృతికి మరో కారణం ఉండి ఉండొచ్చునని అనుమానిస్తోంది. ఎందుకంటే.. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లేదు.

సిమ్రాన్ సింగ్ తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో ‘జమ్మూ కి ధడ్కన్’గా ప్రాచుర్యం పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనికి ముందు ఆమె ఒక పాపులర్ రేడియో స్టేషన్‌లో పనిచేసింది. జమ్మూలో అతి పిన్న వయస్కురాలైన రేడియో జాకీగా, ఫ్రీలాన్స్ రేడియో జాకీగా పనిచేసింది.

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మొత్తం 443 పోస్ట్‌లు చేయగా.. అందులో ఎక్కువ భాగం ఫన్నీ కంటెంట్ కనిపిస్తోంది. ఆమె అకౌంట్లో చూస్తే.. సిమ్రాన్ చివరి పోస్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ 13గా చూపిస్తుంది. అందులో ఆమె ధడక్ చిత్రంలోని పాటకు గౌను ధరించి బీచ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

Read Also : Chiranjeevi – CM Meeting : సీఎంతో మీటింగ్ కి ‘మెగా’ దూరం.. చిరంజీవి ఎందుకు రాలేదు..?