Chiranjeevi – CM Meeting : సీఎంతో మీటింగ్ కి ‘మెగా’ దూరం.. చిరంజీవి ఎందుకు రాలేదు..?
అసలు ప్రభుత్వాలతో మీటింగ్ అంటే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి లేకపోవడం, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ మీటింగ్ లో లేకపోవడం చర్చగా మారింది.

Why Megastar Chiranjeevi and Mega Family not Attends to CM Revanth Reddy Tollywood Meeting
Chiranjeevi – CM Meeting : నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కు FDC చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు అంతా వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
టాలీవుడ్ నుంచి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, చినబాబు, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, BVSN ప్రసాద్..లతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్.. డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, బాబీ, సాయి రాజేష్, అనిల్ రావిపూడి, కొరటాల శివ, హరీష్ శంకర్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్.. పలువురు తెలుగు ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే అసలు ప్రభుత్వాలతో మీటింగ్ అంటే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే మెగాస్టార్ చిరంజీవి లేకపోవడం, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ మీటింగ్ లో లేకపోవడం చర్చగా మారింది. గతంలో చిరంజీవి నేతృత్వంలోనే జగన్ తో, కేసీఆర్ తో మీటింగ్స్ కి వెళ్లారు సినీ పరిశ్రమ. అలాంటిది ఇప్పుడు చిరంజీవి లేకపోవడం, గతంలో ఆయనకు తెలిసిన కాంగ్రెస్ సన్నిహితులే ఉన్నా వెళ్లకపోవడంతో ఎందుకు అని చర్చ జరుగుతుంది.
చిరంజీవి చెన్నైలో అత్యంత సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు అందుకే మీటింగ్ కు వెళ్ళలేదు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఘటన విషయంలో మొదట్నుంచి మెగా ఫ్యామిలీ అంతా దూరంగానే ఉంది. అల్లు అర్జున్ జైలుకి వెళ్లొచ్చిన తర్వాత ఇండస్ట్రీ అంతా వాళ్ళింటికి వెళ్లినా మెగా కాంపౌండ్ నుంచి ఎవ్వరూ వెళ్లలేదు. బన్నీనే చిరు, నాగబాబు ఇంటికి వెళ్లి వాళ్ళని కలిసి వచ్చాడు. ఇక పవన్ అయితే అసలు ఈ ఘటనకు సంబంధం లేకుండా ఏపీలో తన రాజకీయాలు తాను చూసుకుంటున్నాడు.
గత కొన్నాళ్ల నుంచి మెగా – అల్లు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకోవడం, మొదట్నుంచి అల్లు అర్జున్ వివాదంలో చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ అంతా స్పందించకుండా దూరంగా ఉండటం, ఇప్పుడు దిల్ రాజు నేతృత్వంలో వెళ్లారు కాబట్టి సినీ పరిశ్రమకు ఈ మీటింగ్ కి తన నాయకత్వం అవసర్లేకపోవడం అని భావించారేమో అని, కాంగ్రెస్ పార్టీతో మీటింగ్ కాబట్టి తమ్ముడు పవన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండటం.. ఇలా పలు కారణాలతోనే చిరంజీవి ఈ మీటింగ్ కి వెళ్ళలేదు అని టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నిన్న రాత్రి వరకు కూడా చిరంజీవి ఈ మీటింగ్ కి వెళ్తారని, బన్నీ ఇష్యూ గురించి మాట్లాడి వివాదాన్ని క్లోజ్ చేస్తారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే చిరంజీవి ఎందుకు సీఎం రేవంత్ తో మీటింగ్ కి వెళ్ళలేదు అని అధికారిక సమాచారం లేకపోవడంతో ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. అల్లుఅర్జున్ ఘటన తర్వాతే ఈ మీటింగ్ జరగడం, మొదట్నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఘటనకు, ఇప్పుడు మీటింగ్ కి ఎవ్వరూ వెళ్లకపోవడంతో సైలెంట్ గా ఉండటమే మంచిదని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్టు అంతా అనుకుంటున్నారు.