ఉరి తీయాల్సిందే : హాజీపూర్‌ కేసులో ఉరిశిక్షకు శ్రీనివాస్‌రెడ్డి అర్హుడే 

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 01:37 AM IST
ఉరి తీయాల్సిందే : హాజీపూర్‌ కేసులో ఉరిశిక్షకు శ్రీనివాస్‌రెడ్డి అర్హుడే 

Updated On : January 7, 2020 / 1:37 AM IST

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు. చిన్న పిల్లలపై దారుణంగా వ్యవహరించిన వారిపై జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు.

రాష్ట్రంలో సంచలనం రేపిన హాజీపూర్ హత్యల కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో బాధితుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఉరి శిక్షకు శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలా అర్హుడని అన్నారు. పసి పిల్లలను రేప్ చేసి, అత్యంత దారుణంగా చంపేసిన ఇలాంటి కిరాతకులపై జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టుకు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుగా పరిగణించాలని కోరారు. 

నిందితుడికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉన్నట్లు నిరూపించబడిందని… అతడికి నేరచరిత్ర ఉందని గుర్తు చేశారు. గతంలోనూ ఒంటరి మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువైందని తెలిపారు. శ్రావణి హత్య జరిగిన సమయానికి.. అక్కడ స్కూల్ బ్యాగ్, బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్న సమయానికి పెద్దగా తేడా లేదని… బీర్‌ బాటిల్స్ పై నిందితుడి వేలి ముద్రలు లభించాయని తెలిపారు. 

శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ లొకేషన్‌ కూడా అతడే హంతకుడని నిరూపిస్తోందని… శ్రావణి దుస్తులపై అతడి ఆనవాళ్లు దొరికాయన్నారు. కేవలం తన వాంఛ తీర్చుకోవడం కోసం శ్రీనివాస్ రెడ్డి హత్యలు చేశాడని.. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం మంచిది కాదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు హాజీపూర్‌లో జరిగిన హత్యలతో తనకెలాంటి సంబంధం లేదని… పోలీసులే తనను ఇరికించారని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకే న్యాయమూర్తి ఎదుట చెప్పాడు. అయితే కోర్టు ఎదుట బలమైన ఆధారాలు ఉండటంతో నిందితుడికి కఠిన శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయవాదులు చెప్తున్నారు.