లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన పబ్ యాజమాన్యం… అక్రమంగా మద్యం విక్రయాలు.. 15 లక్షల విలువైన మద్యం సీజ్

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన పబ్ యాజమాన్యం… అక్రమంగా మద్యం విక్రయాలు.. 15 లక్షల విలువైన మద్యం సీజ్

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు.  15 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో లాక్ డౌన్ కొనసాగుతోంది. పోలీసులు లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనంతరం నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. 45 జీవో ఉల్లంఘన,  లాక్ డౌన్ లో భాగంగా 188 సెక్షన్, ఎక్సైజ్ కు సంబంధించిన కోవియేషన్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. మొదటగా మద్యం విక్రయిస్తున్న పంజాగుట్టలోని రహస్య స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

జూబ్లీహిల్స్ లో పబ్ కొద్ది రోజులుగా మద్యం విక్రయిస్తోంది. తెల్లవారుజామున, రాత్రిళ్లు మద్యం విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేశారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అల్వాల్, బోయిన్ పల్లి లాంటి పలు ప్రాంతాల్లో అక్రమంగా  పోలీసుల కల్లుగప్పి మద్యం విక్రయాలపై  పోలీసులు ప్రత్యేక దృష్టికి వచ్చింది.