దొంగలనుకుని దాడి : ఒకరు మృతి
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిని దొంగలుగా భావించిన స్థానికులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో మెట్‌పల్లికి చెందిన చిత్తూరి సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అక్కడే ఉన్నశ్రీహరిహర చికెన్ సెంటర్‌ను మెట్‌పల్లి వాసులు ధ్వంసం చేశారు. దీంతో కోరుట్ల ప్రకాశం రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘటనా స్ధలాన్ని పరిశీలించిన డీఎస్పీ .. బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.