Expiry Choclates : బాబోయ్.. ఈ చాక్లెట్లు తింటే చావే, కాలం చెల్లిన చాక్లెట్స్‌కు కొత్త స్టిక్కర్లు వేసి విక్రయం

నకిలీ చాక్లెట్స్ గోదాములపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాలం చెల్లిన చాక్లెట్స్ కు కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ రెడ్డి కాలనీలో ఓ భవనం రెండో అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నారు.

Expiry Choclates : బాబోయ్.. ఈ చాక్లెట్లు తింటే చావే, కాలం చెల్లిన చాక్లెట్స్‌కు కొత్త స్టిక్కర్లు వేసి విక్రయం

Updated On : February 28, 2023 / 9:54 PM IST

Expiry Choclates : నకిలీ చాక్లెట్స్ గోదాములపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాలం చెల్లిన చాక్లెట్స్ కు కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ రెడ్డి కాలనీలో ఓ భవనం రెండో అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నారు.

ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.50 లక్షల రూపాయల విలువ చేసే పిల్లల తినుబండారాలు, కాస్మోటిక్స్ ఇతర ఐటెమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read..Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో చూసి యూరియా, ఆయిల్‌తో కల్తీ పాలు తయారీ

ఉప్పులు, పప్పులు, నూనెలు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు.. మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.  కాసుల కక్కుర్తితో అన్నింటినీ కల్తీ చేసి పడేస్తున్నారు. డబ్బు కోసం దిగజారిపోతున్నారు.  కల్తీ సరుకుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు కంత్రీగాళ్లు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లను కూడా వదల్లేదు. చివరికి కాలం చెల్లిన చాక్లెట్స్ ను సొమ్ము చేసుకుంటున్నారు. వాటికి కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ లో విక్రయించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Also Read..Rotten Chicken And Meat : వామ్మో.. ఈ చికెన్ తింటే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే..! నెల్లూరులో మళ్లీ కుళ్లిన మాంసం కలకలం

ఏ వస్తువుకైనా ఎక్స్ పైరీ అనేది ఉంటుంది. ముఖ్యంగా తినే వస్తువులకు కచ్చితంగా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. పలానా తేదీలోపే వీటిని తినాలని వాటి పై రాసి పెట్టి ఉంటుంది. ఆ తేదీ తర్వాత వాటిని తినకపోవడమే బెటర్. ఎందుకంత ఎక్స్ పైరీ డేట్ తర్వాత అవి చెడిపోయి ఉండొచ్చు. అవి తింటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. అందుకే, ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు కచ్చితంగా ఎక్స్ పైరీ డేట్ చేస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, కొందరు కేటుగాళ్లు వాటిని కూడా వదల్లేదు. కాలం చెల్లిన చాక్లెట్లకు కొత్త స్టిక్కర్లు వేసి మరీ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.