Road Accident : లారీ కిందకు దూసుకెళ్లిన కారు-ప్రమాదంలో ఎస్సై మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్సై మృతి చెందారు. ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో...వేగంగా వస్తున్న ఎస్సై కారు.. దాని కిందకు దూ

Road Accident : లారీ కిందకు దూసుకెళ్లిన కారు-ప్రమాదంలో ఎస్సై మృతి

Road Accident Si Died

Updated On : February 27, 2022 / 11:10 AM IST

Road Accident :  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్సై మృతి చెందారు. ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో…వేగంగా వస్తున్న ఎస్సై కారు.. దాని కిందకు దూసుకు వెళ్లటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుఝూమున చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన పల్లె మాసయ్య గౌడ్‌ కుమారుడు పల్లె రాఘవేందర్‌ (37) రైల్వే ఎస్‌ఐగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని బీటీఆర్‌ మ్యాక్‌ ప్రాజెక్టులో నివసించే తన స్నేహితుడు బాబురెడ్డిని కలిసేందుకు మహబూబ్‌నగర్‌ నుంచి తన స్విప్ట్‌ డిజైర్‌ కారులో బయలుదేరారు.

శనివారం తెల్లవారుజామున శంషాబాద్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వస్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్‌ లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు.

దీంతో ఆ లారీ వెనకాల ఉన్న ఎస్‌ఐ రాఘవేందర్‌ తన కారును నియంత్రించ లేకపోవడంతో ఒక్కసారిగా కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ అక్కడికక్కడే మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.