Rajasthan : నాలుగేళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారం .. సీఎంపై మండిపడ్డ ప్రతిపక్షాలు

హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ పోలీసులే నేరాలకు పాల్పడితే..సమాజాన్ని రక్షించాల్సిన ఖాకీలే అఘాయిత్యాలకు తెగబడితే..ఇక సమాజానికి రక్షణ ఎక్కడ...?

Crime

Rajasthan Crime : హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. న్యాయం చేయమని కోరతాం.కానీ పోలీసులే నేరాలకు పాల్పడితే..సమాజాన్ని రక్షించాల్సిన ఖాకీలే అఘాయిత్యాలకు తెగబడితే..ఇక సమాజానికి రక్షణ ఎక్కడ…? అనే ఆందోళన కలుగుతుంది. అదే జరిగింది రాజస్థాన్ లో. ఓ చిన్నారిపై ఓ ఎస్సై అత్యాచారానికి తెగబడ్డాడు. నాలుగేళ్ల చిన్నపాపను అత్యంత పాశవింకంగా అత్యాచారం చేశాడు. చిన్నారి జీవితాన్ని ఛిద్రం చేశాడు. దీంతో పాప తండ్రితో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహంతో సదరు ఖాకీ కామాంధుడిని పట్టుకుని చితక్కొట్టారు. ఏఎస్పీకి అప్పగించారు.

దౌసా జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై సబ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం (నంబర్ 10,2023) మధ్యాహ్నం చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డాడు. చిన్నపాపని నమ్మించి తన రూమ్ కు తీసుకొచ్చాడు. ని తన రూంకు తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన పాప తండ్రి, స్థానికులతో కలిసి వచ్చి ఎస్సైకు దేహశుద్ది చేశాడు. ఈడ్చుకుంటు వెళ్లి ఏఎస్పీ రామచంద్ర సింగ్ కు అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో తెలిపారు. సదరు ఎస్సైని అదుపులోకి తీసుకున్నామని దర్యాప్తు చేస్తున్నామని..పాపకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు.

Uttar pradesh : కలియుగ ధర్మరాజు, భార్యను జూదంలో పెట్టిన ఘనుడు

ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తు ఆందోళన నిర్వహించారు. ఈ దారుణంపై బీజేపీ ఎంపీ కిరోడీ లాల్ మీనా తీవ్ర ఆగ్రహ వ్యక్తంచేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని..పోలీసులు కూడా అఘాయిత్యాలకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాలిక కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు.