Uttar pradesh : కలియుగ ధర్మరాజు, భార్యను జూదంలో పెట్టిన ఘనుడు
కట్టుకున్న భార్యకు జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు.

Man mortgages wife to losing in gambling
Uttar pradesh Crime : కట్టుకున్న భార్యను జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటివి జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి తన భార్యను జూదంలో పందెంగా పెట్టి వదిలేసి వచ్చాడు. అంతేకాదు..పెళ్లి పేరుతో కన్నవారిని వదిలి అత్తింటికి కాపురానికి వచ్చిన ఆమెకు ఎన్నో కష్టాలుపడింది. అధిక కట్నం కోసం వేధింపులు..కట్టుకున్నవాడు వ్యసనాలకు బానిసగా మారితే మరిది ఆమెపై వేసిన కామపు చూపుల నుంచి తప్పించుకుంటు గుట్టుగా కాపురం చేసింది.
అయినా ఆమెకు భర్త నుంచి వేధింపులు..సాధింపులు తప్పలేదు. కష్టాలను భరిస్తు కాపురం చేద్దామనుకున్న ఆ అమాయకురాలిని నమ్మించి వేరే ఊరు తీసుకెళ్లి అక్కడ జూదం ఆడి ఓడిపోయి..అతను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక..డబ్బులకు బదులుగా భార్యకు వదిలేసి వచ్చాడు. ఈ కలియుగ ధర్మరాజు చేసిన నిర్వాకాన్ని కూడా భరించి సహనంతో ఉన్న ఆమెపై మరిది చూపు పడింది. అన్న చేతకాని తనం..అత్తమామల సాధింపులు..నిస్సహాయంగా ఉన్న వదినపై కన్నేశాడు. అత్యాచారానికి పాల్పడబోయాడు. కానీ ఆమె తప్పించుకుని ఇక ఈ బాధల్ని పడలేనంటూ పోలీసులను ఆశ్రయించటంతో వారి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ పెద్ద తన కుమార్తెను దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారి వివహం జరిగి మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లు ఆమె పడిన బాధలు అంతా ఇంతా కాదు. వ్యవసనాలకు బానిసైన భర్త. సాధించే అత్తామామలు. జులాయిగా తిరిగే మరిది కామపు చూపులు. ఇంతటి విపత్కర పరిస్థిలను భరిస్తు కాపురాన్ని నెట్టుకొస్తోంది ఆమె. పేకాటకు బానిసైన భర్త రూ.15 లక్షలు తేవాలని వేధించేవాడు.
ఈ క్రమంలో ఓ రోజు సదరు భర్త భార్యను నమ్మించి తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లాడు. అక్కడ కూడా జూదం ఆడాడు. ఓడిపోయాడు. డబ్బులు కట్టలేక భార్యను డబ్బులు ఇవ్వాల్సినవాళ్లకు వదిలేసి వచ్చేశాడు. దీంతో ఆమె బిత్తరపోయింది. నిస్సహాయంగా ఉండిపోయింది. సోదరి గురించి తెలుసుకున్న ఆమె సోదరుడుి ఢిల్లీ వెళ్లి వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులిచ్చి విడిపించుకుని వచ్చాడు. తిరిగి అత్తారింటిలో వదిలాడు. కానీ వేరేవాళ్లతో కలిసి ఉన్నావు..నువ్వు మా ఇంట్లో ఉండటానిక వీల్లేదు అంటూ అత్తామామలు ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారు.
దీంతో ఆమె ఒంటరిగా ఉండటం చూసి మరిది కన్ను వేశాడు. ఆమె నిస్సహాయ స్థితిని తనకు అనుగుణంగా వాడుకోవాలనుకున్నాడో ఓ రోజు ఆమెను లైంగికంగా వేధించేవాడు. దానికి ఆమె ఎదురు తిరిగింది. దీంతో అత్యాచారం చేయబోయాడు. ఇక ఈ బాధలు మరించలేక ఆమె సహనం చచ్చిపోయింది. అంతే ఇలా ఉంటే తన జీవితం ఇలాగే ఉంటుందని భావించింది. ధైర్యం చేసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్పీ అనుపమ్ సింగ్ కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తతో పాటు తొమ్మిదిమందిపై వరకట్న వేధింపులు,గృహ హింస, దాడి వంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నారు.