Rape Only Lasted 11 Mins : 11 నిమిషాలే రేప్ చేశాడని.. శిక్ష తగ్గించిన మహిళా జడ్జి

ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. 11 నిమిషాలు రేప్ చేశాడని, పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని చెబుతూ మహిళా జడ్జి శిక్ష తగ్గించింది.

Rape Only Lasted 11 Mins : 11 నిమిషాలే రేప్ చేశాడని.. శిక్ష తగ్గించిన మహిళా జడ్జి

Rape Only Lasted 11 Mins

Updated On : August 10, 2021 / 8:22 PM IST

Rape Only Lasted 11 Mins : ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. 11 నిమిషాలే రేప్ చేశాడని, పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని చెబుతూ మహిళా జడ్జి శిక్ష తగ్గించింది. ఈ తీర్పు అందరిని షాక్ కి గురిచేసింది. మహిళా జడ్జి తీర్పుకి నిరసనగా రోడ్డెక్కారు.

గతేడాది ఫిబ్రవరిలో ఓ నైట్ క్లబ్‌లో ఓ మహిళపై 33ఏళ్ల వ్యక్తి, అతనితోపాటుగా ఉన్న 17ఏళ్ల మైనర్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 17ఏళ్ల మైనర్‌పై జువెనైల్ కోర్టులో విచారణ ఇంకా జరుగుతోంది. కాగా, 33 ఏళ్ల నిందితుడికి కోర్టు నాలుగేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును దోషులు మళ్లీ అప్పీల్ చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బాధితురాలిపై లైంగికదాడి కేవలం 11 నిమిషాలే జరిగిందని, పైగా ఆమెకు తీవ్ర గాయాలేవీ కాలేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందుకే జైలు శిక్షను మూడేళ్లకు కుదిస్తున్నట్టు వెల్లడించారు. లైంగికదాడికి ముందు బాధితురాలి నుంచి వారికి కొన్ని సంకేతాలు వెళ్లాయని గత నెల విచారణలో జడ్జి వ్యాఖ్యానించడం గమనార్హం.

రేప్ కేసులో మహిళా జడ్జి ఇచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. స్విస్ అప్పీల్ కోర్టు ముందు వందలాది మంది ధర్నాకు దిగారు.