Real Estate Fraud in Uppal, Victims Complained to Police
Real Estate Fraud : హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులెత్తేసింది. పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసిన రియల్ ఎస్టేట్ యాజమాన్యం కోట్ల రూపాయలతో హుడాయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
పెట్టుబడులంటూ అమాయకులను మోసం చేసి సుమారు రూ. 500 కోట్లు వసూలుకు పాల్పడి డబ్బుతో పారిపోయినట్టు బాధితులు వాపుతున్నారు. సుమారు 500 మంది ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకుని సుమారు 7వేల మంది కొనుగోలుదారులను మోసం చేసింది. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసానికి పాల్పడినట్టు చెబుతున్నారు.
మోసపోయిన బాధితుల ఆందోళన..
జనగామ ప్రాంత చివారులో తక్కువ రేట్‌లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అంటూ నమ్మబలికి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, చాలామంది కస్టమర్స్ అగ్రిమెంట్ మీదనే కనీసం లక్ష కడితే.. నెలకు 8వేల చొప్పున 20 నెలలకు లక్ష 60వేలు ఇస్తామని చెప్పారని, కొన్ని నెలలు ఇచ్చినట్టు ఇచ్చి అందరిని మోసగించినట్టు బాధితులు వాపోతున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయిన నిందితులపై ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also :Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసు రీఓపెన్ చేసిన పోలీసులు