Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసు రీఓపెన్ చేసిన పోలీసులు

Jubilee Hills Car Accident : 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడుపై వేగంగా ఓ కారు దూసుకెళ్లింది.

Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసు రీఓపెన్ చేసిన పోలీసులు

hyderabad police re opened Jubilee Hills Hit And Run Case for investigation

Hyderabad Hit And Run Case : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును హైదరాబాద్ పోలీసులు రీఓపెన్ చేశారు. 2022లో మార్చ్ 17న రోడ్ నెంబర్ 45లో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడుపై వేగంగా ఓ కారు దూసుకెళ్లింది. అయితే, ఢీకొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్ చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

Read Also :  ఆ కారు ఎమ్మెల్యే షకీల్‌‌దే ?.. పోలీసుల అనుమానాలు

మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి షకీల్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్‌ నంబర్‌ 45 ఢివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న బెలూన్స్‌ అమ్ముకునే కుటుంబంపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. కారు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. కారు షకీల్‌ అహ్మద్‌ అనుచరుడు మీర్జా నడిపినట్లు పోలీసులు అనుమానించారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇప్పుడా ఆ హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు.

Read Also : Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా