Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా

సీసీ ఫుటేజ్, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరుపై మీర్జాను ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు.. మీర్జా ఇన్ ఫ్రా పేరుతో రిజిస్టర్ అయింది.

Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా

Car Accident

Jubilee Hills Car Accident : హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జాను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీర్జాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరుపై మీర్జాను ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి ప్రమాదానికి గురైన కారు.. మీర్జా ఇన్ ఫ్రా పేరుతో రిజిస్ట్రర్ అయింది. దీంతో మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కారు ప్రమాదంలో గాయపడిన ఇవాళ మధ్యాహ్నిం నిమ్స్ కు తరలించారు. అయితే అక్కడి చికిత్స పొందుతున్న బాబు తల్లి కాజల్..ఓపీ కార్డులో సహా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్స్ ఆస్పత్రి డ్యూటీ డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు అదుపు తప్పి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొంది. దీంతో మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు.

MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జాను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలావుంటే జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటనపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాదం విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రమాదానికి గురైన కారు తనదికాదని ఆయన స్పష్టం చేశారు. తన కజిన్ కారు తగిలి పసిపాప మృతి చెందిందని తెలిపారు. తన కజిన్ కారును తాను కూడా అప్పుడప్పుడు వాడతానని చెప్పారు. అందుకే ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టామని పేర్కొన్నారు.

MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్

పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు.

దాంతో బాబుని కింద పడేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్ కి చెప్పానని తెలిపారు. ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు.