MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్

పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.

MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్

Mla Shakeel

MLA Shakeel respond : హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎట్టకేలకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాదం విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రమాదానికి గురైన కారు తనదికాదని ఆయన స్పష్టం చేశారు. తన కజిన్ కారు తగిలి పసిపాప మృతి చెందిందని తెలిపారు. తన కజిన్ కారును తాను కూడా అప్పుడప్పుడు వాడతానని చెప్పారు. అందుకే ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టామని పేర్కొన్నారు. పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు. దాంతో బాబుని కింద పడేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్ కి చెప్పానని తెలిపారు. ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు.

Hyderabad : జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు.. 20 గంటలు దాటినా ముందుకు సాగని దర్యాప్తు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న మహిళని కారు అదుపు తప్పి ఢీకొంది. మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.