Hyderabad : జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు.. 20 గంటలు దాటినా ముందుకు సాగని దర్యాప్తు

నిన్న రాత్రి 8:40 గంటలకు ప్రమాదం జరిగినా.. పోలీసులు నిందితులను గుర్తించలేదు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యులే కారు నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Hyderabad : జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు.. 20 గంటలు దాటినా ముందుకు సాగని దర్యాప్తు

Jubihills

Jubileehills car accident case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో 20 గంటలు దాటినా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు ఇంకా గుర్తించలేదు. పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిన్న రాత్రి 8:40 గంటలకు ప్రమాదం జరిగినా.. పోలీసులు నిందితులను గుర్తించలేదు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యులే కారు నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

డ్రైవర్‌తో పాటు మరొకరు కారులో ఉన్నారని బాధితులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, మరొకరు కారు వదిలి పారిపోయారు. పారిపోయినవారి పోలీసులు కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు. కారు మొత్తం బ్లాక్ గ్లాస్ ఉండటంతో పోలీసులు గుర్తించలేని స్థితిలో ఉన్నారు.

MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రమాదం జరిగిన చోటు వరకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అంటున్నారు. గతేడాది షకీల్ బృందం కారు కొనుగోలు చేసింది. షకీల్ కు చెందిన కారుగా రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఇంకా టీఆర్ నెంబర్‌తోనే తిరుగుతోంది.