అవినీతికే అమ్మా మెుగుడు : రెవెన్యూ ఆఫీసర్ ఆస్తులు వందల కోట్లు

ఈయన ఆఫీసర్ కాదు బాబోయ్.. అవినీతికే అమ్మా మెుగుడు! రూల్స్ పాటించాల్సిన రెవెన్యూ అధికారే లంచగొండులకు రారాజుగా మారాడు. రెవెన్యూ శాఖ నుంచి విడుదలైన నిధులకు గండికొట్టాడో ప్రజల రక్తం పీల్చుకుని పబ్బం గడుపుకున్నాడో కానీ, కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నాడు. చిన్న సమాచారం రావడంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అతని ట్రాక్ రికార్డు తెలిసి షాక్‌కు గురైంది. ఊహించనదాకికంటే భారీగా కనిపించడంతో రోజుల తరబడి విచారణ చేయాల్సి వచ్చింది.
కోటాలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు సాహి రామ్ మీనా. రాజస్థాన్ యాంటీ కరప్షన్ బ్యూరోకు సమాచారం అందడంతో వ్యూహం పన్ని రెడ్ హ్యాండెడ్‌గా బయటపెట్టింది. కమలేశ్ అనే వ్యక్తి ఒపియమ్ లైసెన్సింగ్ ప్రోసెస్‌లో కో ఆర్డి నేటర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్థానంలో ఇంకొకరిని ఉంచితే తనకు లాభం చేకూరుతుందని భావించాడు సాహిరామ్.
ఈ పథకం ప్రకారం కమలేశ్‌ను తప్పించాలనుకున్నాడు. విషయం తెలిసిన కమలేశ్.. సాహిరామ్‌ను అదే పదవిలో కొనసాగాలని ఉందని కోరాడు. దానికి రామ్ రూ.లక్ష ఇస్తేనే అందులో కొనసాగేందుకు ఒప్పుకుంటానని లేకపోతే తన స్థానం సందేహమేనని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన కమలేశ్.. లంచం పుచ్చుకునేందుకు సిద్ధమైన సాహిరామ్‌ను పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు.
ఈ దాడిలో అవినీతి అధికారులే ఆశ్చర్యపోయేంతగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 82ప్లాట్ల డాక్యుమెంట్లు, 25 షాప్‌లు, జైపూర్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక బంగ్లా(రూ.20కోట్లు), ముంబై మహానగరంలో ఓ ప్లాట్, పెట్రోల్ పంప్, కళ్యాణ మండపం, 2 హెక్టార్ల వ్యవసాయ స్థలం ఆస్తులన్ని అతని పేరున ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇంతటితో అయిపోలేదు. రూ.6.22లక్షల విలువైన నగలు, రూ.2.2కోట్ల నగదు అతని నుంచి తీసుకున్నారు. అంతటితో పూర్తయినట్లు భావించని అవినీతి నిరోధక శాఖ ఇంకా విచారణను పొడిగించింది. మీనా పేరిట పలు అవినీతి కేసులు ఉన్నాయంటూ స్థానిక మీడియా తెలిపింది.