Road Accident : ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-తిరుపతి వేదిక్ యూనివర్సిటి ప్రొఫెసర్ మృతి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్ కత్తా -చెన్నై జాతీయ రహదారిపై తిరుపతి నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడం తో ముగ్

Prakasam District Road Accident

Road Accident :  ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్ కత్తా -చెన్నై జాతీయ రహదారిపై తిరుపతి నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడం తో ముగ్గురు మృతి చెందారు.

ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు, యజమాని శ్రీనివాస చారి(58) మృతి చెందగా, వెనుక వైపు కూర్చొని ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి (55 ) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయింది.
Also Read : Dead Body In Water Tank : మిస్టరీగా మారిన వాటర్ ట్యాంక్ మృతదేహం-ఆందోళనలో బస్తీ వాసులు
మృతుడు శ్రీనివాసాచారి  తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శ్రీనివాసాచారి స్వస్ధలం పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. ఉద్యోగం నిమిత్తం తిరుపతిలో నివసిస్తున్నారు.