కారు ఆటో ఢీ : నలుగురి మృతి

నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు.
ఘటన స్ధలంలో ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటం వల్ల ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన వారిని జక్కం గంగమ్మ(65), బాలమణి(55) కల్లేపురంసాయిలు (70) చిక్కెల సాయిలు(60)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా జానకంపేట్ గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.