ఆంధ్రాబ్యాంక్ లో భారీ చోరీ.. 15కిలోల బంగారం మాయం : ఆందోళనలో కస్టమర్లు
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు

చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే బ్యాంక్ సెక్యూరిటీ, అకౌంటెంట్, క్యాషియర్, మేనేజర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ చోరీకి సంబంధించి మేనేజర్ సుబ్రహ్మణ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమర్ రాజా పరిశ్రమ ఆవరణలో ఆంధ్రాబ్యాంకు ఉంది. బ్యాంకులో తనఖా పెట్టిన 15కేజీల బంగారం నగలను… రూ.2లక్షల 66వేల నగదు చోరి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం విలువ 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నగలు, నగదు మాయంపై బ్యాంకు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. లాకర్ లో సేఫ్ గా ఉండాల్సిన గోల్డ్, క్యాష్ మాయం కావడం కలకలం రేపింది. చోరీ విషయం తెలిసి కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. తమ నగలు ఏమయ్యాయో అని టెన్షన్ పడుతున్నారు.
డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ లో పోలీసులు బ్యాంకుకి వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తూరు వెస్ట్ డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇది బయటి వాళ్ల పని కాదని.. ఇంటి దొంగలే పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేశారని పోలీసులు సందేహిస్తున్నారు.