Robbery : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో ఉన్న డిప్యూటీ సీఎం ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత రాష్ట్రం వదిలి పారిపోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వేగంగా స్పందించారు. వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో నిందితులను అరెస్ట్ చేశారు. వారిని బీహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాగూర్ గా గుర్తించారు. నిందితుల నుంచి 2లక్షల 20వేల రూపాయల క్యాష్, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : నాపై కుట్ర జరిగింది..!- పోలీస్ కస్టడీలో కీలక విషయాలు చెప్పిన జానీ మాస్టర్..!
నిన్న డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో పని చేసే వ్యక్తే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. సాయంత్రం ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితులను బెంగాల్ లో పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన వస్తువులను సైతం రికవరీ చేశారు. స్థానిక కోర్టులో నిందితులను హాజరుపరిచి.. హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఇంట్లో పని చేసే వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించి వారి కదలికలపై నిఘా వేశారు బంజారాహిల్స్ పోలీసులు. అనంతరం ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితులను రేపు హైదరాబాద్ కు తీసుకురాబోతున్నారు.