అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2019 / 01:28 PM IST
అలబానియాలో దొరికాడు : రూ.8వేల కోట్లు ఎగ్గొట్టిన పటేల్ అరెస్ట్

Updated On : March 22, 2019 / 1:28 PM IST

దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప్రమోటర్ హితేష్ నరేంద్రభాయ్ పటేల్ అలబానియా దేశంలోని తిరానాలో గురువారం(మార్చి-20,2019) పోలీసులకు దొరికిపోయాడు.భారత్ లోని పలుబ్యాంకులకు స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ రూ.8,100కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట

సంస్థ నిర్వాహకులైన హితేష్ నరేంద్రభాయ్ పటేల్,నితిన్ సందేసర, చేతన్ సందేసర‌,తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆంధ్రాబ్యాంక్,యుకో బ్యాంక్,ఎస్ బీఐ,అలహాబ్ బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వీరు రుణాలు పొందారు.ఆ డబ్బును విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో వారిపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు.అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు అప్పటికే దేశం విడిచి పారిపోయారు. వీరికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 11న ఇంటర్ పోల్ రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా ఇష్యూ చేసింది.

బ్యాంకు మోసాలకు పాల్పడినందుకుగాను స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్,దాని అనుబంధ కంపెనీలపై,వాటి డైరక్టర్లు,సంబంధిత వ్యక్తులపై 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. 2018,మే నెలలో నితిన్,చేతన్ లు,వారి కంపెనీలకు చెందిన రూ.4,700కోట్లు విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఈ కేసు నిందితుల్లో ఒకడైన హితేష్ నరేంద్రభాయ్ పటేల్ ను గురువారం అలబానియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నితిన్‌, చేతన్‌ ఆచూకీ ఇంకా తెలియలేదు.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి