Andrey Botikov : రష్యాలో కలకలం.. కరోనా వ్యాక్సిన్ సృష్టికర్త దారుణ హత్య, అసలేం జరిగింది?

రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త, సైంటిస్ట్ ఆండ్రీ బొటికోవ్(47) దారుణ హత్యకు గురయ్యారు.

Andrey Botikov : రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త, సైంటిస్ట్ ఆండ్రీ బొటికోవ్(47) దారుణ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు బిగించి చంపినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం విలవిలలాడుతున్న వేళ రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మాథమేటిక్స్ సహకారంతో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు బొటికోవ్. గమలేయా రీసెర్చ్ సెంటర్ లో ఆయన సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. బొటికోవ్ ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్లాండ్ అవార్డుతో సత్కరించారు.

Also Read..New Variant BF 7.0 : బీఎఫ్ 7.0 కొత్త వేరియంట్ తో భయం లేదు : సీసీఎంబీ డైరెక్టర్

ఓ 29 ఏళ్ల యువకుడు.. బొటికోవ్ తో గొడవపడ్డాడని, ఆ తర్వాత బెల్టును మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హంతకుడికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Also Read..Bill Gates: ప్రధాని మోదీతో భేటీ తరువాత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌పై పొగడ్తల వర్షం

సైంటిస్ట్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. బోటికోవ్ మృతదేహం దొరికిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తెలిపింది. వాదన సమయంలో బోటికోవ్‌ను 29ఏళ్ల యువకుడు బెల్ట్‌తో గొంతుకు బిగించి చంపాడన్నారు. వైరాలజిస్ట్ మరణాన్ని హత్య కోణంలో పరిశోధిస్తున్నట్లు రష్యాలోని దర్యాప్తు అథారిటీ తెలిపింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందన్నారు. 2020లో కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V ను అభివృద్ధి చేశారు. వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలలో బోటికోవ్ ఒకరు. ఆయన దారుణ హత్య చర్చనీయాంశంగా మారింది.