Bill Gates: ప్రధాని మోదీతో భేటీ తరువాత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌పై పొగడ్తల వర్షం

జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గ్రేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట్స్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.

Bill Gates: ప్రధాని మోదీతో భేటీ తరువాత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌పై పొగడ్తల వర్షం

Bill Gates

Bill Gates: భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోందని, దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని టెక్ దిగ్గజం, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం విధితమే. తాజాగా, మోదీతో భేటీ గురించి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును బిల్ గేట్స్ తన అధికారిక బ్లాగ్ ‘గేట్స్ నోట్స్’లో ప్రస్తావించారు. ఈసందర్భంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ లాంటి ఓ సృజనాత్మక, డైనమిక్ దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని గేట్స్ పేర్కొన్నారు.

Bill Gates: బిల్​గేట్స్ సంచలన నిర్ణయం.. లక్షన్నర కోట్లు దానం!

కరోనా సమయంలో వ్యాక్సిన్లు పెద్దమొత్తంలో సరఫరా చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఇతర దేశాలకు అందించి స్నేహబంధాన్ని చాటుకుందని ప్రశంసించారు. కొవిన్ యాప్.. ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వసించారని, దాన్ని నేనూ అంగీకరిస్తున్నానని గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తాను గత మూడేళ్లుగా పెద్దగా ప్రయాణాలు చేయనప్పటికీ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా కొవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధి గురించి మాట్లాడానని బిల్ గేట్స్ గుర్తు చేసుకున్నారు.

 

కరోనా సమయంలో భారతదేశం 200 మిలియన్ల మంది మహిళలతో సహా 300 మిలియన్ల మందికి అత్యవసర డిజిటల్ చెల్లింపులను చేసిందని బిల్ గేట్స్ అన్నారు. ప్రభుత్వాలు మెరుగ్గా పనిచేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఎలా సహాయపడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని అన్నారు. జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట్స్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.