New Variant BF 7.0 : బీఎఫ్ 7.0 కొత్త వేరియంట్ తో భయం లేదు : సీసీఎంబీ డైరెక్టర్

కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.

New Variant BF 7.0 : బీఎఫ్ 7.0 కొత్త వేరియంట్ తో భయం లేదు : సీసీఎంబీ డైరెక్టర్

OMICRON

New Variant BF 7.0  : చైనాలో బీఎఫ్7.0 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ కారణంగానే ఆ దేశంలో కరోనా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.

దేశంలో ఇప్పటికే మెజార్టీ ప్రజలకు వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనం హెర్ట్ ఇమ్యూనిటీ దశలో ఉన్నామని తెలిపారు. చైనా తరహా పరిస్థితి దేశంలో ఎదురయ్యే అవకాశమే లేదన్నారు. అయితే, అందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

China Corona Virus : చైనాలో కరోనా విలయ తాండవం.. వైరస్ సోకి రోజుకు 9 వేల మంది మృతి

చైనా అమలు చేసిన జీరో కొవిడ్ పాలసీ విధానమే ఆ దేశంలో కేసులు మళ్లీ పెరిగేందుకు కారణమని డాక్టర్ వినయ్ అభిప్రాయపడ్డారు. అందరికీ వ్యాక్సినేషన్ అందకపోవడం కూడా తీవ్రత పెరిగేలా చేసిందన్నారు. ఆ దేశం వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడటమే కొత్త వేరియంట్ వ్యాప్తికి కారణమని చెప్పారు.

కానీ భారత్ లో కరోనా ప్రతి వేరియంట్ కు తగినట్టు రోగనిరోధక శక్తిని పెంచేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిందని గుర్తు చేశారు. వయో పరిమితి లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కొత్త వేరియంట్ ప్రభావం దేశంలో తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.