China Corona Virus : చైనాలో కరోనా విలయ తాండవం.. వైరస్ సోకి రోజుకు 9 వేల మంది మృతి

చైనాలో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అద్యయనాలు చెబుతున్నాయి.

China Corona Virus : చైనాలో కరోనా విలయ తాండవం.. వైరస్ సోకి రోజుకు 9 వేల మంది మృతి

CHINA CORONA

Updated On : January 1, 2023 / 2:30 PM IST

China Corona Virus : చైనాలో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అద్యయనాలు
చెబుతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఎయిర్ఫినిటీ అనే పరిశోధన సంస్థ కరోనా బారిన పడి చైనాలో రోజుకు 9 వేల మంది మరణిస్తున్నారని నివేదికలో పేర్కొంది. కరోనా ఆంక్షలు ఎెత్తివేయకముందు నుంచి కొన్ని ప్రావిన్సులలో కరోనా తీవ్రతను రికార్టు చేస్తున్నామని తెలిపారు.

ఒక్క డిసెంబర్ లో కోటి 86 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వీరిలో సుమారు లక్ష మంది
మరణించి ఉంటారని తెలిపింది. జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదయ్యాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది మరణించే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.

China Corona Cases : చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ఒక్క సిటీలోనే ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదు

అయితే వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ప్రభుత్వాన్ని కోరింది. కరోనా పరిస్థితులపై క్రమం తప్పకుండా నిర్ధిష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని సూచించింది. వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, వ్యాక్సిన్లపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేసింది.