China Corona Cases : చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ఒక్క సిటీలోనే ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదు

చైనాలో మళ్లీ కరోనా విలయం తాండవం చేస్తోంది. ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి బో తావో సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్ డావో నగరంలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

China Corona Cases : చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ఒక్క సిటీలోనే ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదు

CHINA

China Corona Cases : ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ దేశంలో కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. పెద్ద మొత్తంలో కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి బో తావో సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్ డావో నగరంలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే ఆ అధికారి చేసిన ప్రకటనను చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీంతో ఆ దేశంలో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని రోజుల క్రితం చైనాలో లాక్ డౌన్ ఎత్తివేశారు. క్వారంటైన్లు, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించారు. దీంతో చైనాలోని పలు నగరాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. దీంతో ఇన్ ఫెక్షన్లను అదుపు చేయడం ప్రభుత్వ వర్గాలు కష్టంగా మారింది.

China Corona : బాబోయ్.. ఒక్కరోజే 3కోట్ల 70లక్షల కరోనా కేసులు, చైనాలో కోవిడ్ ఉగ్రరూపం

కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోయాయి. కరోనా మృతదేహాలతో స్మశానాల్లో క్యూలైన్ ఉంటోంది. ఓ ప్రావిన్సులో మార్చి నెల నాటికి నాలుగు కోట్ల మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా. మరోవైపు చైనాలో బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో భారీగా కేసులు పెరగడానికి ఈ కొత్త వేరియంట్ కారణంగా తెలుస్తోంది.