Salon Worker Spit: ఛీ..ఛీ.. సెలూన్ షాప్‌‌లో కస్టమర్‌తో వర్కర్ వికృత చేష్ట.. ఏం చేశాడో చూడండి..

ఈ దారుణం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Salon Worker Spit: ఛీ..ఛీ.. సెలూన్ షాప్‌‌లో కస్టమర్‌తో వర్కర్ వికృత చేష్ట.. ఏం చేశాడో చూడండి..

Updated On : May 20, 2025 / 9:19 PM IST

Salon Worker Spit: ఓ సెలూన్ షాప్ లో పని చేసే వర్కర్ నీచానికి ఒడిగట్టాడు. కస్టమర్ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. సెలూన్ షాప్ కి వెళ్లాలంటేనే భయపడేలా చేశాడు. ఇంతకీ ఆ నీచుడు ఏం చేశాడో తెలుసా.. ఫేస్ క్రీమ్ లోకి ఉమ్మి వేసి.. అదే క్రీమ్ తో కస్టమర్ ముఖానికి ఫేషియల్ మసాజ్ చేశాడు. ఏంటి.. వింటుంటేనే కడుపులో దేవినట్లుగా ఉంది కదూ..

ఈ ఘోరం ఘజియాబాద్ లో జరిగింది. సెక్టార్ 5.. వేవ్ సిటీలో ఓ సెలూన్ షాప్ ఉంది. ఫేస్ మసాజ్ కోసం ఓ కస్టమర్ ఆ షాప్ కి వెళ్లాడు. సెలూన్ లో పని చేసే 25ఏళ్ల అర్షద్ అలీ.. నీచంగా ప్రవర్తించాడు. ముందుగా కస్టమర్ ముఖానికి అతడు నీళ్లు స్ప్రే చేశాడు. ఆ తర్వాత తన చేతిలోకి క్రీమ్ తీసుకున్నాడు. ఆపై అదే చేతిలోకి ఉమ్మి వేశాడు. దాన్ని అలానే కస్టమర్ ముఖానికి అప్లయ్ చేసి మసాజ్ చేశాడు.

Also Read: ప్రాణం తీసిన పని ఒత్తిడి..! ఓలా ఏఐ ఆర్మ్ ఇంజినీర్ బలవన్మరణం.. టీమ్ మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు..

ఈ దారుణం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు సెలూన్ వర్కర్ అర్షద్ అలీని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత 271, 272 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, హానికరమైన చర్యల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అర్షద్ అలీపై అభియోగం మోపారు. అర్షద్ అలీ అస్లామ్ కాలనీ దస్నాలో నివాసం ఉంటున్నాడు. కాగా, వారం రోజుల క్రితమే ఈ నీచుడు ఆ సెలూన్ షాప్ లో పనికి చేరాడు. ఇంతలోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.

ఇలాంటి వారిని ఊరికే వదలకూడదని, కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వికృత చేష్టలతో సెలూన్ షాప్ కి వెళ్లాలంటేనే భయమేస్తోందని వాపోయారు. ఇలాంటి కొందరు నీచుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని సెలూన్ షాప్ ల వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.