సంక్రాంతి పండుగ దొంగలు : నగరంలో చెడ్డిగ్యాంగ్ ఎంటర్

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 05:52 AM IST
సంక్రాంతి పండుగ దొంగలు : నగరంలో చెడ్డిగ్యాంగ్ ఎంటర్

హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లడం లేదా ? వెళుదామంటే భయమేస్తోంది..అంటున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. ఎందుకంటే వీరిని చెడ్డిగ్యాంగ్ భయపెడుతోంది. ఇప్పటికే ఊరికి వెళ్లిన వారి నివాసాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనిస్తున్న ఈ గ్యాంగ్ పంజా విసురుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలో జనవరి 05వ తేదీ రాత్రి చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. 
గతేడాది కూడా చెడ్డి గ్యాంగ్ అర్థరాత్రి వేళ్లల్లో రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలకు దొరికిపోయింది. ఈసారి కూడా అదే విధంగా దొంగతనాలు చేయడం కలకలం రేపుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో ఓ ఇంట్లో చోరీ చేశారు. బీరువాలోని ఆభరణాలను అపహరించారు. ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేయడానికి ప్రయత్నించి విఫలం చెందారు. వీరు దొంగతనాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా చెడ్డి గ్యాంగ్ పనా ? లేక అంతర్ రాష్ట్ర ముఠా ? అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.