కూతురి ప్రేమ వ్యవహారమే తండ్రి ప్రాణం తీసిందా..? బిల్డర్‌ మధు హత్య కేసులో సంచలన విషయాలు

పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమను దూరం చేసిన మధును హత్యచేయడానికి రేణుప్రసాద్ స్కెచ్ వేశారు.

Realtor Madhu Incident : హైదరాబాద్ బిల్డర్‌ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధును హత్యచేసింది అతడి స్నేహితులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురి ప్రేమ వ్యవహారం విషయంలో అడ్డువస్తున్నాడని కోపంతో, మరోవైపు కోట్ల ఆస్తిపై కన్నేసిన రేణుకా ప్రసాద్.. మధు హత్యకు  స్కెచ్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినో ఆడదామని బీదర్ కు తీసుకెళ్లి దారుణంగా హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

Also Read : IndiGo Flight : టెన్షన్ పెట్టిన టిష్యూ..! ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దింపిన సిబ్బంది

బిల్డర్ మధుకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరు జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటున్నారు. మధుకు రియల్ ఎస్టేట్ తో పాటు పలు బిజినెస్ లు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు. అతనికి సుమారు రూ. 200 కోట్ల ఆస్తి ఉంది. రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్ధ్ రెడ్డి, వరుణ్ తో మధుకు స్నేహం ఉంది. క్యాసినో ఆటలో మధుకు రేణుకా ప్రసాద్ గ్యాంగ్ తో స్నేహం కుదిరింది. ఆ తరువాత వారు స్నేహితులుగా మారిపోయారు. మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు. నవరాత్రుల టైంలో పూజలో పాల్గొన్న మధు పెద్ద కుతూరుపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు. కొద్దిరోజులకే ఆమెను ప్రేమలోకి దింపిన రేణు ప్రసాద్.. తన ప్రేమ విషయాన్ని మధుకు చెప్పాడు. నీ పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని మధును కోరారు. అందుకు మధు నిరాకరించాడు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల అరెస్టులు?

పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమను దూరం చేసిన మధును హత్యచేయడానికి రేణుప్రసాద్ స్కెచ్ వేశారు. ముందుగా హైదరాబాద్ లోనే హత్యకు ప్రణాళిక వేశాడు. అందుకోసం సుపారీ గ్యాంగ్ ను నెలరోజులు హైదరాబాద్ లో ఉంచాడు. కానీ, హైదరాబాద్ లో మధు హత్యకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో క్యాసినో ఆడుదామని బీదర్ కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుడు మధు, అతని అడ్రస్సును తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యుల సమాచారం ఇచ్చారు. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి, ఆ తరువాత కత్తులతో పొడిచి చంపినట్లు మన్నేకెళ్లి పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు