IndiGo Flight : టెన్షన్ పెట్టిన టిష్యూ..! ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దింపిన సిబ్బంది

విమానం ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకి దింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

IndiGo Flight : టెన్షన్ పెట్టిన టిష్యూ..! ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దింపిన సిబ్బంది

IndiGo Flight

IndiGo Flight Bomb Threat : ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీ కోసం విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. విమానంలోని ప్రయాణికులందరినీ ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా అత్యవసర ద్వారం ద్వారా కిందికి దింపేశారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : Chinese Electric Car : భారత్‌లో ఈ చైనీస్ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ డేలో 200 యూనిట్లు డెలివరీ.. టాప్ సిటీలివే..!

ఈ ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ మాట్లాడుతూ.. ఉదయం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసికి ఇండిగో విమానం (6ఈ2211) బయలుదేరింది. విమానంలో టేకాఫ్ కు ముందు ఎయిర్ క్రాప్ట్ లావేటరీలో బాంబు అని రాసిఉన్న టిష్యు దొరకడంతో ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులకు ఇండిగో సిబ్బంది సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది విమానంలో తనిఖీలు జరిపారు. తనిఖీల అనంతరం విమానంలో బాంబులేదని నిర్ధారించారు.

Also Read : Viral Video: బాత్రూంలో 30 పాములు.. వణికిపోయిన స్థానికులు

టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారిని విమానం నుంచి కిందికి పంపించారు. తనిఖీల తరువాత బాంబు లేదని నిర్ధారణ కావడంతో ఇండిగో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకి దింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.