Viral Video: బాత్రూంలో 30 పాములు.. వణికిపోయిన స్థానికులు

చాలా కాలంగా కనపడకుండా బాత్రూంలోనే బండల కింద ఉన్న పాములు తాజాగా బయటకు వచ్చాయి.

Viral Video: బాత్రూంలో 30 పాములు.. వణికిపోయిన స్థానికులు

Updated On : May 27, 2024 / 7:45 PM IST

ఇంట్లో లేదా బాత్రూంలో ఒక్క పాముని చూస్తేనే వణికిపోతాం? అటువంటిది 30 పాములు ఒకేసారి కనపడితే? గుండె ఆగినంత పని అవుతుంది. ఇటువంటి ఘటనే అసోంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చాలా కాలంగా కనపడకుండా బాత్రూంలోనే బండల కింద ఉన్న పాములు తాజాగా బయటకు వచ్చాయి. అసోంలోని నాగావ్ జిల్లాలో ఓ ఇంట్లో నుంచి దాదాపు 30కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసిన స్థానికులు భయపడిపోయారు. వెంటనే పాములు పట్టే సంజీబ్ దేకా అనే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించారు.

ఆ ఇంట్లో నుంచి అతడు పాములను సురక్షితంగా తీసుకు వెళ్లాడు. గతంలో కూడా అతడు కలియాబోలోని టీ ఎస్టేట్ నుంచి 55 కిలోల కంటే బరువున్న 14 అడుగుల పొడవైన ‘బర్మీస్’ కొండ చిలువను ఇవే విధంగా కాపాడి తీసుకెళ్లాడు. పాములు కనపడితే ఇక్కడి ప్రజలకు మొదట గుర్తుకు వచ్చేది సంజీబ్ దేకానే.

Also Read: కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు.. హోటల్స్‌లో బయటపడుతున్న దారుణాలు