Serial Killer : మద్యం మత్తులో సైకో ఉన్మాదం.. నగరంలో రెండు వారాల్లో 3 హత్యలు…! ​​​​​​​

మద్యానికి బానిసయ్యాడు. మందు దొరకపోతే సైకోలా మారిపోతాడు. తాను ఏం చేస్తాడో తెలియదు. ఆ కోపంలో ఏది కనిపిస్తే దాంతో తలలు పగలకొట్టేస్తాడు.

Serial Killer Qadeer : మద్యానికి బానిసయ్యాడు. మందు దొరకపోతే సైకోలా మారిపోతాడు. తాను ఏం చేస్తాడో తెలియదు. ఆ కోపంలో ఏది కనిపిస్తే దాంతో తలలు పగలకొట్టేస్తాడు. మద్యానికి డబ్బు కోసం ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారినుంచి చోరీ చేస్తున్నాడు. అడిగినంత ఇస్తే ఓకే.. లేదంటే వాళ్లను బండరాళ్లతో తలపై మోది దారుణంగా చంపేస్తున్నాడు. అతడే.. ఉన్మాది మహ్మద్‌ ఖదీర్‌.. మద్యం మత్తులోనే ఈ హత్యలు చేస్తున్నాడు. ఇప్పటివరకూ రెండు వారాల వ్యవధిలో ఉన్మాది మహ్మద్‌ ఖదీర్‌ నాలుగు హత్యల వరకు చేసినట్టు హబీబీ నగర్ పోలీసులు వెల్లడించారు. ఉన్మాది మహ్మద్‌ ఖదీర్‌ను అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బాగ్దల్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖదీర్‌ చదువులేదు. చిన్నతనం నుంచే తండ్రి వేధింపులతో ఇబ్బందులు పడ్డాడు.  దూషించడం, కొట్టడం చేయడంతో అతడు మానసికంగా కృంగిపోయాడు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్‌ చేరాడు. బోరబండలోని సఫ్దర్‌నగర్‌లో భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నాడు. భార్య కూడా దూరంగా ఉంటోంది. తన దగ్గర డబ్బులను ఖదీర్‌ భార్యకు ఇంటికివెళ్లి ఇస్తుంటాడు. ఫుట్‌పాత్‌లపై బతికుతూ కూలీపనులు చేసుకునేవాడు. వీలు కుదిరినప్పుడుల్లా ఆటోడ్రైవర్‌గానూ పనిచేసేవాడు.

ఇతడికి ఉన్న చెడ్డ లక్షణం ఒకటే.. మద్యం సేవించడం.. మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేడు. ఇదే అతన్ని సైకోలా మార్చేసింది. చీప్‌ లిక్కర్‌ తాగి మత్తులో తూలేవాడు. సరైన సమయంలో మద్యం తాగకపోతే ఉన్మాదిగా మారుతాడు. చీప్‌ లిక్కర్‌ కొనేందుకు డబ్బులు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రించే యాచకులను అడుగుతాడు. ఇవ్వకపోతే  వారు నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై మోది చంపేస్తాడు. యాచకులు నిద్రిస్తున్న సమయంలో వారి వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతన్ని అడ్డుకుంటే దారుణంగా చంపేస్తుంటాడు. 2017లో రెండు ఆటోలు చోరీ చేసిన కేసుల్లో హబీబ్‌నగర్‌ పోలీసులకు ఈ ఖదీర్ చిక్కాడు. అప్పట్లో జైలుకు వెళ్లి ఆరు నెలల శిక్ష కూడా అనుభవించాడు.

2019 డిసెంబర్‌ 30న నాంపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ముబారక్‌ అలీ అనే వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు. 2020 జనవరి 2న నిందితుడిని పోలీసులు అరెస్టు అయ్యాడు. 2021 ఏప్రిల్‌ 4 వరకు జైల్లోనే  గడిపాడు. బెయిల్‌ ఇవ్వడానికి ఎవరూ రాకపోవడం, ఏడాదిన్నర పాటు జైల్లోనే ఉన్నాడు. న్యాయస్థానమే మాండేటరీ బెయిల్‌ ఇచ్చింది. గత నెల 15న హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తిని చంపేశాడు. గత నెల 31న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని అగ్గిపెట్టె కావాలంటూ లేపి అడిగాడు. అతడు డబ్బు డిమాండ్‌ చేయడంతో ఇవ్వలేదు. బండరాయితో మోది అతడిని చంపేశాడు. జేబులో రూ.150, మద్యం సీసాను కూడా ఖదీర్‌ తస్కరించాడు. ఆ మద్యం తాగి నాంపల్లి గూడ్స్‌ షెడ్‌ వద్దకు వెళ్లాడు. ఆటోట్రాలీలో నిద్రిస్తున్న ఖాజాను లేపి పడుకునేందుకు చోటు అడిగాడు. అతడు లేదనండంతో బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. కేసులు చేసిన పోలీసులు అందిన సమాచారం ఆధారంగా ఖదీర్‌ను పట్టుకున్నారు. పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని నిర్ణయించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.
Read Also :  Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం

ట్రెండింగ్ వార్తలు