Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం

అతడిని ఉరి తీయొద్దు అంటూ...ఆన్ లైన్ లో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ..ఆన్ లైన్ వేదికగా ఉద్యమం నడుస్తోంది.

Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం

Singapur

Disabled Malaysian Man : అతడిని ఉరి తీయొద్దు అంటూ…ఆన్ లైన్ లో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ..ఆన్ లైన్ వేదికగా ఉద్యమం నడుస్తోంది. మానసికంగా..దివ్యాంగుడైన ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించొద్దూ..విన్నపాలు చేస్తున్నారు. 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మలేసియాకు చెందిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె.ధర్మలింగంను పోలీసులు అరెస్టు చేశారు. 2009లో సింగపూర్ లో 42.72 గ్రాముల హెరాయిన్ ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్ కు 2010లో మరణశిక్ష విధించింది.

Read More : Doug Potato : వామ్మో.. ఈ ఆలుగడ్డ చూశారా.. ప్రపంచంలోనే అతిపెద్దదట!

నవంబర్ 10వ తేదీన నాగేంద్రన్ ను ఉరి తీయనున్నట్లు వార్తలు రావడంతో..మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందారు. క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైపర్ యాక్టివిటీ డిజార్జర్ తో నాగేంద్రన్ బాధ పడుతున్నాడని, అతడికి క్షమాభిక్ష  సాదించాలంటూ..ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్ కు అభ్యర్థలను పంపుతున్నారు. అక్టోబర్ 29వ తేదీన ఆన్ లైన్ వేదికగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50వేల సంతకాల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ 39 వేల 962 సంతకాలను సేకరించారు. నాగేంద్రన్ కుటుంబం మలేషియా నుంచి సింగపూర్ కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.