వెంటాడి, వేటాడి : పాతబస్తీలో హత్యల కలకలం

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 02:09 AM IST
వెంటాడి, వేటాడి : పాతబస్తీలో హత్యల కలకలం

హైదరాబాద్: పాతబస్తీలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానికులను ఆంధోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చార్మినార్ ఏరియాలో భగవాన్ దేవి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడిని 42 ఏళ్ల రవిగా పోలీసులు గుర్తించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రవి పరుగులు తీశాడు. దుండగులు అతడిని వెంటాడి కత్తులతో పొడిచి అత్యంతక కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. అంతా చూస్తుండగానే ఈ మర్డర్ జరిగింది.

రవిపై దుండగులు దాడి దృశ్యాలను కొందరు స్థానికులు తమ ఫోన్‌లతో చిత్రీకరించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీమ్స్ స్పాట్‌కు చేరుకున్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. మృతుడు రవి కుటుంబం పాతబస్తీలోనే నివాసం ఉంటుంది. కొన్ని రోజులుగా అతను ఇంటికి వెళ్లకుండా ఓ గుళ్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని అక్క, బావను.. పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతో ప్రత్యర్థులే రవిని హత్య చేశారా.. లేక మరేదైనా కారణం ఉందా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.