Chennai Car Accident (Photo : Google)
Chennai Car Accident : అతివేగం అత్యంత ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అతివేగం కారణంగా ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారో కళ్లారా చూస్తున్నాం. అయినా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అత్యంత వేగంగా వాహనాలు నడిపి ఘోర ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇలాంటి వీళ్లు చేసే తప్పులకు అమాయకులకు శిక్ష పడుతోంది. ఎలాంటి తప్పు చేయని వాళ్లు, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చెన్నైలో ఘోర ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్ చాలా దారుణంగా ఉంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు గుద్దిపడేసింది. అంతే, ఈ ప్రమాదంలో పాపం ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
అది కిల్ పాక్ ప్రాంతం. వాహనాల రాకపోకలతో ఆ రహదారి అంతా కూడా చాలా రద్దీగా ఉంది. అటు ఇటు వాహనాలు తిరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు చాలా వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఎదురు నుంచి బలంగా గుద్దేసింది.
Also Read..Bhavya Sri: సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?
కారు ఎంత వేగంగా వచ్చి గుద్దింది అంటే..ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారు ముందుగా ఓ స్కూటర్ ను ఢీకొట్టింది. చాలా స్పీడ్ గా వచ్చిన కారు రోడ్డుపై నిలిపి ఉంచిన పలు వాహనాలను కూడా గుద్దిపడేసింది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ కి గురయ్యారు.
ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం అని తెలుస్తోంది. ఓవర్ స్పీడ్ గా కారుని నడిపిన డ్రైవర్.. దాన్ని అదుపు చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాపం ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేయలేదు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎలాంటి తప్పు చేయకపోయినా అతడి ప్రాణం పోవడం స్థానికులను కలిచివేసింది. అతివేగం అత్యంత ప్రమాదకరం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రోడ్డు మీద వెళ్లేటప్పుడు కేర్ ఫుల్ గా ఉండాలి. ఏ మాత్రం వాహనం అదుపుతప్పినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
Also Read..Delhi Crime: ఐపోన్-15 డెలివరీ లేట్ అయిందని మొబైల్ షాప్ వర్కర్లను చితకొట్టారు
#WATCH | சென்னை: பிரேக்-க்கு பதில் ஆக்ஸிலேட்டரை அழுத்திய L Board ஓட்டுனர் – பாதசாரி பரிதாப பலி!#SunNews | #Chennai | #CarAccident pic.twitter.com/emqELaBifL
— Sun News (@sunnewstamil) September 28, 2023