SGPC: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో ఉన్న గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించినందుకు మహిళను కాల్చి చంపిన కేసులో అరెస్టయిన నిర్మల్‌జిత్ సింగ్ సైనీ అనే వ్యక్తికి శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) మద్దతుగా నిలిచింది. అతడి తరపున న్యాయ పోరాటం చేసేందుకు ఉచితంగా సహాయం చేస్తోంది. ప్రజల మతపరమైన మనోభావాలు గురుద్వారాలకు ముడిపడి ఉన్నాయని, అక్కడ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే సహించేది లేదని SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి అన్నారు.
TSRTC Reduced Fares : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జీలు తగ్గింపు
సైనీ మతపరమైన మనోభావాలను సదరు మహిల దెబ్బతీసిందని, అందుకే అతడు ఉద్వేగభరితమైన ప్రతిస్పందించాల్సి వచ్చిందని SGPC చీఫ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. “శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ అతని కుటుంబానికి అండగా నిలుస్తుంది. అతనికి న్యాయ సహాయం అందించడానికి కట్టుబడి ఉంది” అని SGPC అధ్యక్షుడు ధామి చెప్పారు.
Kodali Nani : సీఎం జగన్ పై సినిమా తీయాలన్న పవన్ ట్వీట్ కు కొడాలి నాని కౌంటర్
పర్వీందర్ కౌర్ 30 ఏళ్ళ మహిళ ఆదివారం సాయంత్రం దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారాలోని ‘సరోవర్’ (పవిత్ర చెరువు) దగ్గర మద్యం సేవిస్తోంది. గురుద్వారాకు నిత్య సందర్శకుడైన సైనీ ఈ ఘటన చూసి తన లైసెన్స్ రివాల్వర్‌ని ఉపయోగించి పర్వీందర్ కౌర్‌పై పలుసార్లు కాల్పులు జరిపాడు. అరెస్టయిన నిందితుడు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు కోపంతో ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు ముందు ఒప్పుకున్నాడు.