TSRTC Reduced Fares : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జీలు తగ్గింపు

ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

TSRTC Reduced Fares : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జీలు తగ్గింపు

e-Garuda electric bus

e-Garuda electric bus : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు.

ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మియాపూర్ – విజయవాడ ఛార్జీ రూ.830 నుంచి రూ.760కు, ఎంజీబీఎస్ – విజయవాడ ఛార్జీ రూ.780 నుంచి రూ.720కు తగ్గించినట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ లోని మియాపూర్ లో 10 ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తో కలిసి ప్రారంభించారు.

TSRTC: ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఈ-గరుడ పేరుతో అందుబాటులోకి

ఈ ఏడాదిలోగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకు ఒక ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే మొదటగా ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.