Girl Gangraped : ఆరేళ్ల బాలికపై తాత, మామ సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపపై తాత, మేనమామ సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Girl Gangraped : ఆరేళ్ల బాలికపై తాత, మామ సామూహిక అత్యాచారం

Girl Gangraped By Uncle, Grandpa

Updated On : September 23, 2021 / 11:15 AM IST

Six year old girl Gangraped by uncle, grandpa in Madhya pradesh : మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపపై తాత, మేనమామ సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భోపాల్ లోని ఆరేళ్ల బాలికను,ఆమె తమ్ముడిని ఏప్రిల్2వ తేదీన ఆమెకు మేనమామ(20) వరసయ్యే వ్యక్తి సమోసాలు కొనిపెడతానని చెప్పి బయటకు తీసుకు వెళ్లాడు.

సమోసాలు కొనిపెట్టకుండా బాలికను బంధువుల ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ ఆమె తాత(48) ఉన్నాడు. తాత, మామలిద్దరూ ఆరేళ్ల బాలికను ఒక గదిలోకి తీసుకువెళ్లి ఆమె సోదరుడి ఎదురుగానే ఆత్యాచారం చేశారు. అనంతరం బాలికకు రూ. 20 ఇచ్చి ఈ విషయంఎవరికీ చెప్పవద్దని కోరారు.

ఈఘటన జరిగిన వారం రోజులకు బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి గురువారం ఏప్రిల్ 8వ తేదీన ప్రశ్నించటంతో బాలిక, ఆమె తమ్ముడు జరిగిన విషయం తల్లికి వివరించటంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. బాధితురాలి తల్లి స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంకింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.