Sangareddy : వ్యసనాలకు బానిసై తండ్రిని చంపిన కొడుకు

వ్యసనాలకు బానిసైన  కొడుకు  తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

Sangareddy : వ్యసనాలకు బానిసై తండ్రిని చంపిన కొడుకు

Son Killed His Father

Updated On : January 14, 2022 / 4:45 PM IST

Sangareddy : వ్యసనాలకు బానిసైన  కొడుకు  తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్ పల్లిలో నివసించే చాకలి లక్ష్మయ్య(60)  కు కిష్టయ్య(42) అనే కొడుకు ఉన్నాడు

కిష్టయ్య మద్యానికి,జల్సాలకు  అలవాటు పడ్డాడు. అతనికి ఇప్పటికి  మూడు సార్లు వివాహం అయ్యింది.  ముగ్గురు భార్యలు ఇతని ప్రవర్తన, వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నారు.   ఈరోజు మద్యం సేవించటానికి తండ్రి లక్ష్మయ్యను  కొడుకు కిష్టయ్య మద్యానికి డబ్బులు ఇవ్వమని అడిగాడు.
Also Read : Nun Rape Case : క్రైస్తవ సన్యాసిని రేప్ కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
అప్పటికే కొడుకు ప్రవర్తనతో  విసుగు చెందిన లక్ష్మయ్య డబ్బులు ఇవ్వలేదు.  దీంతో ఆగ్రహించన కిష్టయ్య  తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.