ఢిల్లీలో కారు భీభత్సం..ముగ్గురికి తీవ్ర గాయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 01:21 PM IST
ఢిల్లీలో కారు భీభత్సం..ముగ్గురికి తీవ్ర గాయాలు

ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో  అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు  ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలయ్యారు. గాయపడిన వారిని స్థానికులు డాక్టర్ మనోహర్ లోహియా హాస్పిటల్ కు తరలించారు.

కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఆటో కూడా తుక్కు తుక్కు అయిపోయింది. ప్రయాద సమయంలో ఆటోలో ఇద్దరు రష్యన్ మహిళలు ఉన్నారు. ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ని ఆశిశ్ చాడాగా గుర్తించారు.  ఆశిశ్ ను 2012లో హత్యకు గురైన లిక్కర్ కింగ్ పాంటీ చాడా మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు.ఆశిశ్ ని అరెస్ట్ చేసి ఐపీసీ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు న్యూఢిల్లీ డీసీపీ తెలిపారు. ఘటన సమయంలో ఆశిశ్ మద్యం తాగి వాహనం నడపలేదని తెలిపారు. పంజాబ్ కి చెందిన ఇద్దరు పోలీసులు సెక్యూరిటీలో భాగంగా ఎస్కార్ట్ వాహనంలో చాడా కారుని ఫాలో అవుతున్నట్లు తెలిపారు

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.సగటున ప్రతి నాలుగు నిమిషాలకొకసారి ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు.