Viral Video : వెన్నులో వణుకు పుట్టించే వీడియో.. వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ఇంటి గోడకు తలకిందులుగా వేలాడిన మహిళ..

ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video : కర్నాటకలోని మంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ మహిళ గాల్లోకి లేచింది. ఓ ఇంటి కాంపౌండ్ గోడకు తలకిందులుగా వేలాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేగంగా దూసుకొచ్చిన కారు మహిళను ఢీకొట్టడం, ఆమె గాల్లోకి లేవడం, ఇంటి కాంపౌండ్ గోడకు తలకిందులుగా వేలాడటం.. అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి.

బెజై కపికాడ్ లోని 6వ మెయిన్ రోడ్ లో ఈ ఘోరం జరిగింది. సతీశ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగినట్లు పోలీసులు గుర్తించారు. సతీశ్ కుమార్.. పాత కక్షలతో మురళీ ప్రసాద్ ను చంపేందుకు కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. మురళీ ప్రసాద్ ను చంపాలని ప్లాన్ చేసుకున్న సతీశ్.. అప్పటికే తన కారుతో రోడ్డుపై వెయిట్ చేస్తున్నాడు. మురళీ ప్రసాద్ బైక్ పై రోడ్డు మీదకు రాగానే.. వేగంగా వచ్చి కారుతో అతడిని ఢీకొట్టాడు.

Also Read : చేప కొరకడంతో చేతి వేలిపై చిన్న గాయం.. ప్రాణాలు పోతాయని అరచెయ్యి తీసేసిన వైద్యులు.. అసలేం జరిగిందంటే?

అయితే, అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ అతడి కారుకి ఎదురుగా వచ్చింది. మురళీ ప్రసాద్ ను చంపేయాలని వచ్చిన సతీశ్.. కారుతో వేగంగా మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరింది. ఓ ఇంటి కాంపౌండ్ గోడకున్న రెయిలింగ్ కు తలకిందులుగా వేలాడింది.

వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గోడకు తలకిందులుగా వేలాడుతున్న మహిళను అంతా కలిసి కిందకు దించారు. ఈ ఘటనలో మహిళ కాలికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో బైకర్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కారుతో వారిద్దరిని గుద్దిన సతీశ్.. అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, అసలు విషయం తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. పాత కక్షలతో ఓ వ్యక్తిని చంపేందుకు సతీశ్ ఇలా చేశాడని, ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయమైందని తెలిసి అంతా బిత్తరపోయారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవ.. ఏ పాపం తెలియని మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిజానికి సతీశ్ టార్గెట్ మురళీ ప్రసాద్. అతడిని లేపేయాలని అనుకున్నాడు. కానీ, మహిళ కూడా గాయాలపాలైంది.

సతీశ్, మురళీ ప్రసాద్ కు పాత కక్షలు ఉన్నాయి. 2023లో మురళీ ప్రసాద్ సతీశ్ తండ్రిని బైక్ తో ఢీకొట్టాడు. దాంతో గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకున్న సతీశ్.. మురళీ ప్రసాద్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే అతడిని కారుతో ఢీకొట్టి చంపేయాలని చూశాడు. ఈ క్రమంలో ఏ పాపం తెలియని మహిళ తీవ్ర గాయాల పాలైంది.