Harassment Student Died : మెడికో ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం.. సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి

ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

student

Harassment Student Died : ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తే రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షిత మరొకరితో కలిసి ఉన్న ఫొటోలను సీనియర్ విద్యార్థి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఆమెను వేధింపులకు గురి చేశాడు.

Medico Preethi Passes Away : మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

దీంతో మనస్థాపానికి గురైన రక్షిత వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు. రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షిత మిస్సింగ్ కేసు కూడా నమోదు అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇంతలోనే రక్షిత నిర్జీవంగా కనిపించారు.