Medico Preethi Passes Away : మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.

Medico Preethi Passes Away : మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

Medico Preethi Passes Away : సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. బ్రెయిన్ డెడ్ తో ఆదివారం రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్లు నిమ్స్ డాక్టర్లు ప్రకటన విడుదల చేశారు. కాగా, మృతురాలిని వేధించిన సీనియర్ సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ప్రీతి మృతితో నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాలతో పాటు గిరిజన సంఘాలు, బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో నిమ్స్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మెడికో ప్రీతి.. 5 రోజులు మృత్యువుతో పోరాడింది.

Also Read..Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు

మరోవైపు పోలీసు బలగాలు నిమ్స్ ఓపీ బ్లాక్ ని చుట్టుముట్టాయి. ప్రీతి తల్లిదండ్రులతో ప్రభుత్వ పెద్దలు, నిమ్స్ డాక్టర్లు, పోలీసులు చర్చలు జరుపుతున్నారు. సరైన హామీ వచ్చేంత వరకు ప్రీతి మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేది లేదని ప్రీతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టంకి ఏర్పాట్లు చేశారు గాంధీ మార్చురీ విభాగం.

ఆదివారం రాత్రి 9.16 నిమిషాలకు ప్రీతి మృతి చెందినట్లుగా నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ”మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి ఆరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్నా. డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది”.

డాక్టర్ ప్రీతి మృతితో వరంగల్ లో టెన్షన్ నెలకొంది. ఎంజీఎం ఆస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కూడా పోలీసు భద్రత పెంచారు. అటు డాక్టర్ ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా మొండ్రాయి శివారు గిర్నిగడ్డ తండాలో విషాదం అలుముకుంది. ప్రీతి మృతితో గిర్నిగడ్డ తండా గిరిజనులు ఆందోళనకు దిగారు. అనస్థీషియా హెచ్ ఓడిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read..Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

అటు, జాతీయ రహదారిపై గర్నిగడ్డ తండా గిరిజనులు ఆందోళనకు దిగారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ప్రీతి మృతితో కేఎంసీలోని ప్రీతి సహ విద్యార్థుల్లో విషాదం అలుముకుంది. వరంగల్ కేఎంసి వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. కేఎంసీ, ఎంజీఎం వద్ద బందోబస్తుతో గస్తీ నిర్వహిస్తున్నాయి పోలీసు బలగాలు.