Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రీతి మరణించినట్లు ఆదివారం సాయంత్రం నిమ్స్ వైద్యులు తెలిపారు

Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు

Preethi

Medico Preeti Case: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రీతి మరణించినట్లు ఆదివారం సాయంత్రం నిమ్స్ వైద్యులు తెలిపారు. ఎక్మో, వెంటిలేటర్ మీద నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందించారు. కాగా, ప్రీతిని కాపడడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని, కానీ కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు తెలిపారు.

రాత్రి 9:10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తనను కాలేజీలో సీనియర్లే వేధించారంటూ ప్రీతి కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అనంతరం విషయ పరిస్థితిలో మొదట వరంగల్‫‭లో్ చికిత్సి అందించారు. అయితే పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. గత ఐదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ ప్రీతి మరణించినట్లు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రీతి ఏం తీసుకుందో స్పష్టంగా తెలియడం లేదు. రక్తనమూనాలు ఇప్పటికే పంపామని, అవి వస్తే విషయం ఏంటనేది తెలుస్తుందని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగనాథ్ అన్నారు. ఆత్మహత్యకు ముందు గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలిసిందని, కాగా తమకు సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ దొరికిందని ఆయన అన్నారు.