Si Attack On Wife
Sub Inspector Attack : కోర్టు ఆవరణలోనే భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా గురజాలలో ఎస్సైగా పని చేస్తున్న నాగార్జున 2017 లో లావణ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత నాగార్జున మరో యువతితో ప్రేమాయణం నడుపుతూ ఉండటంతో లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Vallabhaneni Vamsi : నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ… పొరపాటు జరిగిందని విచారం
దీంతో ఎస్సై నాగార్జున భార్య లావణ్య నుంచి విడాకులు కావాలని 2019లో కోర్టులో కేసు వేశాడు. కేసువిషయమై ఈరోజు ఆత్మకూరుకు వచ్చిన భార్య లావణ్య, అత్తమామలపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయుపడిన లావణ్య ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.