Vallabhaneni Vamsi : నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ… పొరపాటు జరిగిందని విచారం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.

Vallabhaneni Vamsi : నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ… పొరపాటు జరిగిందని విచారం

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కాగా, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు కూడా చెప్పారు. భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశానన్న వంశీ.. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధపెట్టి ఉంటే తనను క్షమించాలన్నారు. ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమేనని.. ఆ వ్యాఖ్యలకు బాధపడుతున్నానని వంశీ అన్నారు.

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

తెలుగుదేశం పార్టీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరినే అన్న వంశీ.. ఆమెను అక్కా అని పిలుస్తానని చెప్పారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని.. వ్యక్తిగతంగా బాధపడుతున్నందునే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుని కూడా క్షమపణ కోరుతున్నా.. తప్పు జరిగినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని వంశీ కోరారు. నా నుంచి ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదని, ఆత్మ సాక్షిగా క్షమాపణ చెబుతున్నానని వంశీ అన్నారు.

”ఆవేశంలో పొరపాటున కొన్ని వ్యాఖ్యలు చేశాను. నేను క్షమాపణ చెబుతున్నా. పొరపాటు మాట్లాడినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పుకుంటే తప్పేముంది. పొరపాటుని పర్సనల్ గా ఫీల్ అయ్యాను కాబట్టే భువనేశ్వరికి సారీ చెప్పాను. నన్ను ఎవరూ భయపెట్టి చెప్పించలేదు. నిజానికి నేను ఒకటి మాట్లాడితే.. చంద్రబాబు 95శాతం కలిపారు. ఈ వివాదానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెడతారా? కంటిన్యూ చేస్తారా? అనేది చంద్రబాబు చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఏమీ లేదు. మొన్నటి దాకా మతాన్ని వాడుకున్నారు.. ఇప్పుడు కులాన్ని వాడుకుంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.

కార్తీక భోజనాల్లో మన కులం ఆధిపత్యమే కొనసాగాలన్న విష సంస్కృతి మొదలైంది. వేరే వర్గాలను తిట్టి అనవసర సామాజిక అశాంతిని రేపుతున్నారు. చంద్రబాబు తర్వాత కమ్మ కులం ఉండదా? వేరే రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. నాకు వస్తున్న బెదిరింపుల వెనక చంద్రబాబు హస్తముంది. హేట్ స్పీచ్ ని ప్రోత్సహిస్తున్నది చంద్రబాబే. చంద్రబాబు కమ్మ కులానికి ఆదిపురుషుడేమీ కాదు. టీడీపీలో ఉంటే ఉత్తముడిని.. బయటికొస్తే అవినీతి పరుడినా?” అని వల్లభనేని వంశీ అన్నారు.