మాజీ మిస్ ఇండియాకు సైబర్ వేధింపులు

సూపర్ మోడల్.. మాజీ మిస్ ఇండియా(వరల్డ్) నటాషా సూరి తనపై లైంగిక వేధింపులపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫ్లైన్ రెమెడియోస్ అనే వ్యక్తి ఆమె పేరును ట్యాగ్ చేస్తూ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. అడల్ట్ కంటెంట్ ఉండే కొన్ని సైట్లలో ఇలా చేయడంతో నటాషా తన లాయర్ మాధవ్.వీ కలిసి ముంబైలోని దాదర్ పోలీస్ స్టేషన్ రెమెడియోస్‌పై బుధవారం కంప్లైంట్ చేసింది.
ఇదంతా నవంబరులో మొదలైంది. కొంతమంది వ్యక్తులు ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలు రాసి నాకు ట్యాగ్ చేస్తున్నారు. బాత్రూంలో ఉండే అమ్మాయిల అభ్యంతరకరమైన ఫొటోలు తీసి మొహాన్ని బ్లర్ చేస్తూ నా పేరును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నార. నటాషా సూరీ సింగ్ అనే పేరుతో చేస్తున్నారు ఇదంతా. అసలు ఇలాంటి పేరే లేదు. నన్నే టార్గెట్‌గా పెట్టుకుని చేస్తున్నారు’
‘ఫేక్ వార్తలన్నింటికీ నటాశా సూరీ సింగ్ అనే ఉద్దేశించి రాస్తున్నారు. నిజానికి అలాంటి అమ్మాయే లేదు. ఉన్నది మోడల్ నేనొక్కదాన్నే. ట్విట్టర్ అకౌంట్లలో, బ్రాతూం పిక్చర్లు తీసికొన్ని ఫేక్ న్యూస్ తో అతని సైట్ లో పోస్టు చేస్తున్నాడు. వీటన్నిటిని ఓపెన్ చేయాలంటే @NatSuriపేరును ఉంచుతున్నాడు. ఆ పేరు మెన్షన్ చేస్తే గూగుల్ లో నేనే వస్తున్నా’ అంటూ వాపోయింది.
‘అంతేకాదు ఆ వ్యక్తి నన్ను చాలా వివాదాల్లోకి లాగుతున్నాడు. డేంజర్ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అనవసరంగా దీన్ని అంటిస్తున్నాడు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా’ అని రిక్వెస్ట్ చేసింది. 2006 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ విజేత నటాషా సూరి మిస్ వరల్డ్ టాప్ 10కాంటెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 2016లో మళయాళ చిత్రం కింగ్ లయర్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘Inside Edge’ లాంటి మరికొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.